News February 5, 2026
ADB: ఒకే వేదికపై తండ్రి, కొడుకు.. అరుదైన రాజకీయ ప్రస్థానం

ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో జోగు రామన్న కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. జోగు రామన్న ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే, 2020 మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద కుమారుడు ప్రేమేందర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తండ్రి ఎమ్మెల్యేగా, కొడుకు మున్సిపల్ ప్రజా ప్రతినిధులుగా కొనసాగి ప్రజల మన్ననలు పొందారు.
Similar News
News February 25, 2026
పోలవరంలో పెద్దపులి సమాచారం..అధికారుల తీరుపై అసహనం

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరించడం తెలిసిందే. అయితే అటవీశాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పులిని దట్టమైన అటవిలో వదిలి ఉండాల్సిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే చాలా పులులు ఉండడం వల్ల ఇక్కడ వదలాల్సి వచ్చిందని, గతంలో పులి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తిరిగినా ఎవరికి హాని చేయలేదని గుర్తు చేస్తున్నారు.
News February 25, 2026
BREAKING: పాలమూరు: ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. MBNR జిల్లా నవాబ్‌పేట్(M) చాకలిపల్లికి చెందిన పురుషోత్తం(19) యన్మంగండ్లలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో చదువుపై శ్రద్ధ వహించడం లేదని కుటుంబీకులు ఇటీవల అతడిని మందలించారు. దీంతోపాటు ఇటీవల అతడి లవ్ కూడా ఫెయిలైందని మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
News February 25, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.


