News July 26, 2024
ADB: కట్నం విషయంలో భార్యను వేధించాడు.. చివరికి

అదనపు కట్నం విషయంలో భార్యను వేధించిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానాను విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2017 మార్చి నెలలో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తలమడుగు PSలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7గురు సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన నిందితుడు లచ్చన్నకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.
News November 12, 2025
ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్‌హత్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.
News November 12, 2025
ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.


