News April 8, 2025
ADB: కత్తిని చూపిస్తూ బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

ఆదిలాబాద్ చించర్వాడకు చెందిన తోట విగ్నేష్ రామనవమి శోభాయాత్రలో కత్తిని చూపిస్తూ చంపేస్తానంటూ బెదిరించినందున కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. భారీ ర్యాలీలో నిందితుడు కత్తితో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. కత్తులను చూపిస్తూ బెదిరించి చంపేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 8, 2025
ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News April 8, 2025
ఆదిలాబాద్లో 12ఏళ్ల బాలికపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News April 8, 2025
బోథ్: కత్తుల ప్రదర్శన చేసిన వారిపై కేసు నమోదు

బోథ్ మండల కేంద్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో బహిరంగంగా కత్తుల ప్రదర్శన చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ర్యాలీలో కార్తీక్, రాహుల్, ఆకాష్ అనే వ్యక్తులు బహిరంగంగా ర్యాలీలో కత్తుల ప్రదర్శన చేశారని ఎస్సై వివరించారు. నిబంధన విరుద్ధంగా ర్యాలీలో మరణ ఆయుధాలు ప్రదర్శించిన వారిపై సోమవారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు