News September 2, 2025

ADB: కరెంట్ వైర్లు కిందకు ఉన్నాయా..?

image

జిల్లాలో 1,378 మండపాల్లో వినాయకులు కొలువై ఉన్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ఎక్కువగా 7, 9 రోజుల్లో నిమజ్జనాలు చేపడతారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు విద్యుత్ అధికారులు కీలక సూచనలు చేశారు. శోభాయాత్ర మార్గంలో కేబుల్, విద్యుత్తు తీగలు లూస్ లేదా కిందకి వేలాడుతూ ఉంటే స్థానిక విద్యుత్ అధికారులకు తెలియజేస్తే వాటిని సరిచేయడం లేదా తొలగించడం చేస్తారన్నారు. విద్యుత్తు తీగల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.

Similar News

News September 2, 2025

ADB: ఈనెల 6న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

image

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News September 2, 2025

గణపతి పూజల్లో ADB జిల్లా అధికారులు

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎఎస్పీ కాజల్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదానం కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

News September 2, 2025

18న రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

image

ADB రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న రిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని రిమ్స్ డైరెక్టర్ డా.జైసింగ్ రాథోడ్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు ఇతర వివరాలను rimsadilabad.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.