News October 4, 2025

ADB: కాంగ్రెస్ కసరత్తు షురూ..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడతో ముందుకువెళ్తోంది. జడ్పీ ఛైర్మన్ పదవులు కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి నలుగురు చొప్పున ఎంపిక చేయాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బేల, భీంపూర్ మండలాల్లో ఇప్పటికే పలువురి దరఖాస్తులు తీసుకున్నారు. 6వ తేదీలోపు ప్రక్రియ పూర్తిచేస్తారని సమాచారం.

Similar News

News October 5, 2025

ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి రద్దు

image

గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రానున్న రెండో ఆర్డినరీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ప్రజావాణి రద్దు చేశామని ప్రజలు ఎవరు కలెక్టరేట్‌కు రాకుడదని సూచించారు.

News October 4, 2025

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం

image

ఎన్నికల్లో అన్ని స్థానాల‌ను కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంటుద‌ని అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి ధీమా వ్య‌క్తం చేసారు. శ‌నివారం ఆయన క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో విడివిడిగా స‌మావేశ‌మ‌య్యారు. బేల, భోర‌జ్, జైన‌థ్ మండ‌ల నాయ‌కులతో భేటీ అయ్యి ప‌లు అంశాల‌పై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావ‌హులు, వారి బ‌లాబ‌లాల‌పై సమీక్షించారు.

News October 4, 2025

వారంలో 15 సైబర్ క్రైమ్ కేసులు: ADB SP

image

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. గతవారంలో 15 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ప్రతివారం జిల్లా సైబర్ క్రైమ్ బృందం వారు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు.