News January 30, 2025

ADB: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News July 5, 2025

మతపరమైన అంశాల్లో కలగజేసుకోం: భారత్

image

భారత ప్రభుత్వం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ‘మత విశ్వాసాలపై ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోదు. భారత్‌లో మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంలో కలగజేసుకోవద్దని భారత్‌ను చైనా <<16940241>>హెచ్చరించిన <<>>విషయం తెలిసిందే.

News July 5, 2025

ఇండ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణ ప్రగతిపై రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని డీఆర్డీఓకు సూచించారు. జిల్లాలో మొత్తం 4,779 ఇండ్లు మంజూరయ్యాయని, 1558 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. 2,794 ఇళ్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

News July 5, 2025

KMR: పేలుడు పదార్థాల పట్టివేత.. నలుగురి అరెస్ట్

image

కామారెడ్డిలో శుక్రవారం పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. ASI చైతన్య రెడ్డి వివరాలు.. కేపీఆర్ కాలనీలో శ్రీధర్‌కు చెందిన ప్లాట్‌లో బండరాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో నలుగురిని అదుపులో తీసుకొని వారి నుంచి 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 16 కార్డెక్స్ వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.