News February 14, 2025

ADB: ‘కేంద్రమంత్రి అశ్విన్ కుమార్‌ను కలిసిన ఎంపీ నగేశ్’

image

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్‌ను ఎంపీ నగేశ్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నుంచి ADB వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లను ADB వరకు పొడిగించాలని కోరారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, కాజీపేట నుంచి హౌరాకు పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.

Similar News

News February 19, 2025

యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ADB బిడ్డల ప్రతిభ

image

హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో మంగళవారం మొదటి రోజు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు. అనిల్, రాణి సిల్వర్ మెడల్ సాధించగా, అరుణ, సక్కు కాంస్యం మెడల్స్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ తెలిపారు. క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

News February 19, 2025

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

image

ప్రేమ పేరుతో లోబరుచుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన యువకుడిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన యువతిని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.

News February 19, 2025

ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో పరిధిలో టెండర్లు

image

ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో పరిధిలోని బస్‌ స్టేషన్లలో పక్కా స్థలం, ఖాళీ ప్రదేశాల్లో వ్యాపారాల నిర్వహణకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్‌ కల్పన ప్రకటనలో పేర్కొన్నారు. ఆక్షన్‌, మ్యానువల్‌ టెండరు విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌, జైనథ్‌, ఇచ్చోడ బస్‌స్టేషన్లలో మొత్తం 19 స్థలాలకు టెండర్లు దరఖాస్తు ఫారాలు ఈనెల19వరకు సమర్పించాలన్నారు.

error: Content is protected !!