News September 21, 2025

ADB: కొండా లక్ష్మణ్.. ఆయన జీవితమే పోరాటం

image

స్వాతంత్ర్యమే కాదు.. తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. ASF(D)లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. TRS ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.

Similar News

News September 21, 2025

టంగుటూరు: 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకు సీజ్

image

విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News September 21, 2025

HYD: క్యాప్స్‌ గోల్డ్‌లో 5వ రోజు ఐటీ సోదాలు

image

క్యాప్స్‌ గోల్డ్‌లో 5వ రోజూ ఐటీ సోదాలుజరుగుతున్నయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చెయ్యగా ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

News September 21, 2025

KNR: ‘ఒక్కేసి పువ్వేసి’.. ఒక్కో రోజు.. తీరొక్క రూపంలో

image

ఉమ్మడి కరీంనగర్‌లో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మహిళలు ఒక్కోరోజు ఒక్కో రూపంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.