News September 17, 2025
ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి, తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 1940లో, జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.
Similar News
News September 17, 2025
స్మార్ట్ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News September 17, 2025
PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్‌లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.
News September 17, 2025
HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.