News January 29, 2025
ADB: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార పేట గ్రామానికి చెందిన ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘానికి బుక్ అఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించిందని ఆదివాసీ సకల కళా సంక్షేమ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన జయతి జయతి జయ మామ భారతం అనే నృత్య కార్యక్రమంలో తెలంగాణ తరఫున పాల్గొన్న నృత్య బృందానికి ఈ ఘనత దక్కిందని తెలిపారు.
Similar News
News November 13, 2025
VJA: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

తల్లిదండ్రులు మరణించడంతో మానసిక వేదనతో నెల్లూరు నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్న 19 ఏళ్ల యువతికి ఆటో డ్రైవర్లు అండగా నిలిచారు. ఆకలితో అలమటిస్తున్న ఆమెకు ఆహారం ఇచ్చి, కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను సురక్షిత కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ల మానవత్వాన్ని పలువురు అభినందించారు.
News November 13, 2025
మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News November 13, 2025
VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


