News September 27, 2025

ADB: గుబురెత్తిన వడ్డీ వ్యాపారులు

image

ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పోలీసులు జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, పాస్‌బుక్‌లు, స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకొని 18 కేసులు నమోదు చేయడంతో అక్రమ వ్యాపారుల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. పలువురు వడ్డీ వ్యాపారులు తమ ఇళ్లకు తాళం వేసి పరారు కాగా.. మరికొంత మంది తాకట్టు పెట్టుకున్న పత్రాలను దాచే పనిలో పడ్డారు.

Similar News

News October 26, 2025

కైలాష్ సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

image

వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, వనవాసి కల్యాణ పరిషత్ అధికారి శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

News October 26, 2025

ADB: కాంగ్రెస్‌లో కొత్త ట్రెండ్

image

కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల(డీసీసీ) పదవుల్లో సైతం బడుగులకు ప్రాధాన్యతనివ్వనుంది. నిన్న ఢిల్లీలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% అధ్యక్ష పదవులు ఇవ్వాలని, గతంలో ఎలాంటి పదవులు చేపట్టని వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో డీసీసీ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.

News October 26, 2025

ఆదిలాబాద్: ‘31లోగా బోర్డుకు ఫీజు చెల్లించాలి’

image

ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు (రూ. 220), గ్రీన్ ఫండ్ ఫీజు (రూ.15) కలిపి మొత్తం రూ.235ను ఈనెల 31 లోగా చెల్లించాలని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్‌లు tgbie.cgg.gov.in పోర్టల్‌ ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన ఆదేశించారు. సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.