News November 7, 2024

ADB: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టులకు ఉట్నూర్‌లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీటీ సామాన్య శాస్త్రం 3, ఇంగ్లిష్ 3, పీజీటీ భౌతిక శాస్త్రం 1, వృక్ష, భౌతిక, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాల్లో ఒక్కో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికల పాఠశాలల్లో మహిళలతోనే భర్తీ చేస్తామన్నారు.

Similar News

News November 22, 2024

విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి: ADB కలెక్టర్

image

పది, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం నిర్వహించారు. పదో తరగతలో ప్రత్యేక తరగతులు నిర్వహించి డిసెంబర్ నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి 2025 రివిజన్ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు.

News November 21, 2024

ADB: రిమ్స్ అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టు విడుదల

image

ఆదిలాబాద్ రిమ్స్‌లో డిప్లొమా ఇన్ ఆప్తల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. లిస్ట్‌ను నోటీస్ బోర్డుపై ఉంచామాన్నారు. ఎమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22న రిమ్స్ ఆఫీసులో సంప్రదించాలని, లిస్టులో ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈ నెల 23న హాజరు కావాలన్నారు.

News November 21, 2024

ADB: పులికి అభయారణ్యంలో అనుకూల వాతావరణం!

image

ఉమ్మడి జిల్లాలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం పెద్ద పులికి పూర్తిస్థాయి ఆవాసంగా మారిందని అధికారులు అన్నారు. గతంలో మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు వచ్చిపోయేవి. ఈసారి మాత్రం రెండు పులులు వచ్చి ఉంటాయని, అందులో ఒకటి ఉట్నూర్-జోడేఘాట్ మీదుగా తడోబాకు వెళ్లి ఉంటే, మరొక పులి నార్నూర్లో మండలంలో సంచరిస్తూ ఉండవచ్చని అధికారులు తెలిపారు. పులులు నివాసాయోగ్య ప్రాంతాలను వెతుకుతున్నాయని వారన్నారు.