News February 5, 2025

ADB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

అన్ని గురుకులాలలో 5-9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 6 వరకు ప్రభుత్వం పొడిగించిందని ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లో నమోదుచేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 7, 2026

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్

image

రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పీవో యువరాజ్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు

News January 6, 2026

అటవీ ప్రాంతాల్లో రోడ్డు పనుల అనుమతులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల మీదుగా ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ సంరక్షణ చట్టాల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు.

News January 6, 2026

ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు నియమాలు పాటించాలి: డీఎస్పీ

image

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ సరుకులు రవాణా చేయవద్దని, ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా ఓనర్లు బాధ్యత వహించాలని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ప్రయాణికులు, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.