News December 23, 2025
ADB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

తెలంగాణా గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సమన్వయధికారి లలిత కుమారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.
Similar News
News December 25, 2025
ములుగు: మేత కోసం తప్పని మోత..!

ఎద్దులేని వ్యవసాయం అయ్యింది. ఊరికి 10 జతల ఎడ్లు కూడా కనిపించట్లేదు. ఉన్న వాటికీ మేత కరవవుతోంది. వేల ఎకరాల్లో వరి సాగైనా యంత్రాల వాడకం పెరగడంతో గడ్డి తక్కువగా లభిస్తోంది. దీంతో గ్రాసం విలువైనదిగా మారింది. వరి కల్లాలు పూర్తయిన తర్వాత రైతులు గడ్డిని యంత్రాలతో మోపులుగా చుట్టించి నిల్వ చేసుకుంటున్నారు. బండ్లపై గడ్డిని తరలిస్తుండగా తమ ‘మేత కోసం ఎడ్లు మోత మోస్తున్న’ ఈ దృశ్యం Way2News కెమెరాకు చెక్కింది.
News December 25, 2025
MBNR: ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తా సమీపంలో నారాయణపేట జిల్లా మరికల్ స్కూల్ బస్సు అదుపుతప్పి కింద పడ్డ సంఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై లెనిన్ ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News December 25, 2025
GOVT శాఖల విద్యుత్ బకాయి ₹35,982 కోట్లు

TG: ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. TGSPDCL, NPDCLలు నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. సాగునీటి శాఖ ₹22,926 కోట్లు, HYD వాటర్ బోర్డు ₹7,084 కోట్లు చెల్లించాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టు విభాగం ₹5,972 కోట్లు కట్టాల్సి ఉంది. గత 5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాగా ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్తగా ఏర్పాటుచేసిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.


