News December 1, 2025
ADB: గొంతు ఎత్తాలి.. నిధులు తేవాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలైనా గోడం నగేశ్ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాసర ఆలయ అభివృద్ధి, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, సిర్పూర్, మంచిర్యాల రైల్వే లైన్‌లో కొత్త రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్లో అభివృద్ధిపై చర్చించాలి. పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరాలి.
Similar News
News December 5, 2025
కామారెడ్డి: 3వ విడత రెండవ రోజు నామినేషన్లు ఎన్నో తెలుసా!

బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, డోంగ్లి, మద్నూర్, జుక్కల్, నస్రుల్లాబాద్, బీర్కూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల్లో 3వ విడత ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు దాఖలైన నామినేషన్లను అధికారులు వెల్లడించారు.168 సర్పంచ్ స్థానాలకు 281 నామినేషన్లు, 1,482 వార్డు స్థానాలకు 992 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా నమోదు కావొచ్చు.
News December 5, 2025
మేడారంలో గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు

మేడారంలో గురువారం గోవిందరాజు గద్దెను పూజారులు కదిలించారు. ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు పూజారులు మేడారానికి చేరుకొని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఐదుగురు పూజారులతో కలిసి గద్దెను కదిలించారు.
News December 5, 2025
నేడు నర్సంపేటకు సీఎం.. షెడ్యూల్ ఇదే..!

నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ రానున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో రూ.531 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మెడికల్ కళాశాల సమీపంలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1:15 గం.కు బేగంపేట నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి, 2 గంటలకు నర్సంపేట హెలీప్యాడ్ చేరుకుంటారు. మ.2:15 నుంచి 3:55 వరకు కార్యక్రమాల్లో పాల్గొని, 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.


