News March 31, 2025

ADB: గ్రూప్-1లో అమరేందర్‌కు 149 ర్యాంకు 

image

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్‌ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 16, 2026

ఆదిలాబాద్: రూ.70 తగ్గిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,050గా నిర్ణయించారు. గత వారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.70 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ పురపీఠంపై ‘పొత్తు’ పొడుపు!

image

ఆదిలాబాద్‌ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ క్రమంలో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వతంత్రుల మద్దతు కోసం పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విలువల కంటే పీఠమే ముఖ్యమైందని స్థానికులు విమర్శిస్తున్నారు.

News February 15, 2026

బోథ్: బంతి కోసం వెళ్లి బాలుడి మృతి

image

బోథ్ మండలంలో విషాదం నెలకొంది. కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడింది. బంతి కోసం వెళ్లిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.