News April 9, 2025

ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

Similar News

News April 17, 2025

జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్ సెషన్ 2 <>ఫైనల్ కీ<<>> విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సెషన్ 2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

News April 17, 2025

నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు

News April 17, 2025

ఏటూరునాగారం: వడదెబ్బతో కూలీ మృతి

image

వడదెబ్బతో కూలీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) ప్రతి రోజు సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవారు. బుధవారం రాత్రి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందారు.

error: Content is protected !!