News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 6, 2025
మెదక్: డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి

డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశా వర్కర్ల నుంచి మొదలు పెడితే, టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రిన్సిపల్స్ వరకూ ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాల్సిందేనన్నారు. ఈ మేరకు బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవన్నారు.
News March 6, 2025
నేడు క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సమగ్ర కులగణనకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.
News March 6, 2025
రాష్ట్ర స్థాయిలో ఆదర్శ పాఠశాలగా జక్కాపూర్

రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉన్నత పాఠశాల జక్కాపూర్ ఉన్నత పాఠశాల అని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.