News September 2, 2025

ADB: చేసేదే అక్రమ దందా.. ఆపై పబ్లిసిటీ

image

ఉమ్మడి ADBలో ఇసుక, మొరం అక్రమ దందాకు అదుపు లేకుండా పోయింది. వాగుల్లోంచి ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండటం పరిపాటిగా మారింది. పలు మండలాల్లో మొరం దందా కూడా కొనసాగుతోంది. మంచి పేరున్న పలువురు నేతలు అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి అమ్ముకుంటున్నారు. రోడ్లపై కొన్ని గుంతలు పూడ్చి తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం గమనార్హం. లోకల్ ఎలక్షన్లు వచ్చాయని ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

Similar News

News September 2, 2025

ASF జిల్లాలో షీటీం పనితీరు భేష్: ఎస్పీ

image

ఆగస్టు నెలలో షీ టీం బృందాల ద్వారా 3 ఎఫ్ఎఆర్ కేసులు, 83 హాట్ స్పాట్ ప్రదేశాలను గుర్తించినట్లు ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షీ టీం బృందాలు నెల రోజులలో 25 పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. వివిధ ప్రదేశాలలో ఉండి మహిళలను వేధిస్తున్న వారిని ASF రప్పించి కేసులను నమోదు చేయడంలో ASF షీ టీం బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయన్నారు.

News September 2, 2025

మేరికపూడిలో విషాదం.. తండ్రీకొడుకుల దుర్మరణం

image

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.

News September 2, 2025

బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సత్యపాల్

image

బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సత్యపాల్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మెప్మా విభాగంలో మహిళలకు సకాలంలో నిధులు అందించేలా చర్యలు తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తానన్నారు.