News March 7, 2026

ADB: జర జాగ్రత్త..!

image

మార్చి నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో 38.7, ఆదిలాబాద్ 38.6, నిర్మల్ 38.6, కొమురం భీమ్ జిల్లాలో 38.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 8, 2026

మందమర్రి: ఉరేసుకొని విద్యార్థి సూసైడ్

image

మంచిర్యాల జిల్లా మందమర్రిలో విషాదం చోటుచేసుకుంది. అంగడిబజార్ సీఎస్పీ రోడ్డులో ఉంటున్న విద్యార్థి తనయి(16) ఉరేసుకున్నాడు. విద్యార్థి సింగరేణి హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు అర్ధాంతరంగా ఉరేసుకొని మరణించడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 8, 2026

వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

image

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్‌లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్‌లో ‘AK47’ ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

News March 8, 2026

MDK: పెరిగిన గ్యాస్ ధర.. రూ.36 కోట్ల భారం

image

కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11.56 లక్షల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులపై ఏడాదికి సుమారుగా రూ.36 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పప్పులు, నూనె, బియ్యం వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది.