News March 27, 2025
ADB: జాతీయస్థాయి టోర్నీకి రితీక

బిహార్‌లో నేటి నుంచి 30 తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ బాలికల జట్టుకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి జాబడే రితీక ఎంపికయ్యారు. జాతీయస్థాయి టోర్నీకి రితీక ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ గోడం నగేశ్, ఛైర్మన్ పాయల్ శంకర్, అధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 22, 2025
జాగ్రత్త.. పోలీసులమని చెబితే నమ్మకండి: ADB DSP

సివిల్ డ్రెస్సులో పోలీసులమంటూ వాహన తనిఖీలు నిర్వహించినా, విలువైన ఆభరణాలు అడిగినా, వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించలని ADB DSP జీవన్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బేల మండలంలో నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ బంగారం అపహరించారని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ నూతన పద్ధతులలో మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల చెర నుంచి తప్పించుకోవాలని సూచించారు.
News April 21, 2025
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ADB SP

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ADB SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం అనంతరం రిపోర్టు దాఖలు చేయాలని సూచించారు.
News April 21, 2025
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ADBలోని సాయుధ ముఖ్య కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులను నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.