News March 25, 2025

ADB: జిల్లాకు 2 మంత్రి పదవులు..!

image

రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిజిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సమస్యలపై MLAలు ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఇతరులను కలవాల్సి వచ్చేది. దీంతో ప్రజల సమస్యలు తీరలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో చెన్నూర్ MLA వివేక్, తర్వాత MNCL MLA ప్రేమ్‌సాగర్‌రావుకు దక్కనున్నట్లు సమాచారం.

Similar News

News November 8, 2025

హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

image

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.

News November 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 8, 2025

JIO: ఉచితంగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!

image

ఇప్పటివరకు 18-25 ఏళ్ల మధ్య వారికే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను ఇప్పుడు 25ఏళ్లు పైబడిన వారికీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. My Jio యాప్‌లో దీన్ని క్లైమ్ చేసుకోవచ్చు. ఇందుకు 5G ప్లాన్ యాక్టివేటై ఉండాలి. దీని ద్వారా రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్ 18నెలల పాటు ఫ్రీగా పొందొచ్చు. ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి.