News January 24, 2025
ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 4, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News November 4, 2025
జాలర్ల విడుదలకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు: కలెక్టర్

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన 9 మంది జాలర్లు బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి అప్పన్న ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఎంబసీతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, జాలర్ల విడుదల కోసం ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
News November 4, 2025
SU B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. 1వ, 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ పరీక్షలు NOV 13 తేదీ నుంచి DEC 4వ తేదీ వరకు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.


