News February 21, 2025
ADB: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: కలెక్టర్

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవితోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2025
ADBకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆమెకు పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.
News February 21, 2025
ఇంద్రవెల్లి: నాలుగు వైన్స్‌ల్లో చోరీ

ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం నార్నూరులోని వ్యాపారి ఇంట్లో, వైన్ షాపులో చోరీ జరగింది. అది మరవకముందే గురువారం రాత్రి ఉట్నూర్ ఎక్స్ రోడ్, లోకారి, ఈశ్వర్ నగర్ వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం వైన్ షాపు యజమానులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు.
News February 21, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.