News January 27, 2025
ADB జిల్లా వాసికి జీవనసాఫల్య పురస్కారం

ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి జీవన సాఫల్య పురస్కరానంని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతకు చేసిన విశిష్ట సేవలు, పచ్చదనం, పర్యావరణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు రాజ్‍భవన్ తెలిపింది.
Similar News
News November 13, 2025
నెల్లూరు: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

యువతి ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులున్న ఈ సమాజంలో విజయవాడ ఆటోడ్రైవర్లు మానవత్వం చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వేదనకు గురై నెల్లూరు నుంచి విజయవాడ చేరుకుని యువతికి అండగా నిలిచారు. పర్సు పొగొట్టుకుని, ఫోన్, డబ్బుల్లేక బస్టాండ్‌లో ఆకలితో అలమటిస్తున్న ఆమెకి అండగా నిలిచారు. పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను సురక్షిత కేంద్రానికి చేర్చిన ఆటో వాలాలపై అభినందనలు వస్తున్నాయి.
News November 13, 2025
సముద్రతీరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలోని పరిశవారిపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 13, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధర రూ.50 పెరిగినట్లు వెల్లడించారు.


