News April 16, 2025

ADB: ‘జొన్నల కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడాలి’

image

జొన్నల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రతి జొన్న రైతుకు మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అమ్ముతున్న వివరాలను పొందుపరచాలని మార్కెటింగ్ శాఖకు ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు.

Similar News

News April 16, 2025

ADB: పోలీసులపై పోస్టులు.. ఒకరిపై కేసు: CI

image

ఇటీవల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన నేరస్థుడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటంతో పాటు పోలీసుల వైఖరిని విమర్శించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.ADB ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ పోలీసులను కించపరిచేలా పోస్టులు పెట్టాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించడంపై కేసు నమోదు చేశారు. నిందితుడు పెట్టిన ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కేసు పెడతామన్నారు.

News April 16, 2025

ADB: నాలుగు రోజుల్లో పరీక్షలు.. చదువుకున్నారా..?

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ADBలోని డీఈఓ ఆఫీస్‌లో పరీక్ష నిర్వాహణ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు 518 మంది, ఇంటర్మీడియట్ పరీక్షకు 395 మంది అభ్యాసకులు హాజరవుతారన్నారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

News April 16, 2025

ADB: బెల్ట్ షాపుపై దాడులు.. కేసు నమోదు: CI

image

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో రూ. 2,200 విలువైన మూడు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాజుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!