News October 6, 2025
ADB: టికెట్ కోసం పోరు.. పార్టీ లీడర్లకు పెద్ద సవాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బడా నేతలకు సవాలుగా మారింది. సర్పంచ్ స్థానానికి ఇద్దరేసి, జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నలుగురు తమకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్ఠానం వెంట పడుతున్నారు. భీంపూర్, ఉట్నూర్, బేల, భోరజ్, జైనథ్, సాత్నాల మండలాల్లో భారీగా పోటీ ఉండటంతో అన్ని పార్టీల జిల్లా నేతలకు తలపోటుగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే భయం పట్టుకుంది.
Similar News
News October 6, 2025
ADB: ADHAAR సేవల ఛార్జీల్లో మార్పు

యూఐడీఏఐ (UIDAI) ఆధార్ ఎన్రోల్‌మెంట్, అప్‌డేట్ సేవల ధరలను సవరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్రోల్‌మెంట్, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) (5-17 ఏళ్లు) ఉచితంగా ఉంటాయన్నారు. జనగణన వివరాల అప్‌డేట్ (పేరు, చిరునామా)కు రూ.75, బయోమెట్రిక్ అప్‌డేట్ (వేలిముద్రలు, కనుపాప)కు రూ.125 ఆధార్ ప్రింటవుట్‌కు రూ.40 చెల్లించాలన్నారు. ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వివరించారు.
News October 6, 2025
క్రమం తప్పకుండా తరగతులకు రావాలి: ADB DIEO

దసరా సెలవులు ముగిశాయని.. ఇంటర్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేశ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ముఖ గుర్తింపు (Face Recognition) సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేస్తామన్నారు. ఈ హాజరును అంతర్గత, ప్రాక్టికల్ IPE 2026 థియరీ పరీక్షలలో పరిగణలోకి తీసుకుంటామన్నారు.
News October 5, 2025
ADB: కారు జోరు.. చేరికలతో గెలుస్తుందా పోరు

స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ జోరు పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రచారం వేగవంతం చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బోథ్‌లో MLA అనిల్ జాదవ్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ చేరికలపై దృష్టిసారించారు. ప్రత్యర్థి పార్టీల్లోని మెజార్టీ లీడర్లను చేర్చుకునేలా ముందుకెళ్తున్నారు.