News February 12, 2025
ADB: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు

ఆదిలాబాద్ డివిజన్‌లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News January 8, 2026
పీపీపీలతో నష్టం ఉండదు: NMC ఛైర్మన్

AP: వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేయడమే జాతీయ వైద్య కమిషన్(NMC) లక్ష్యమని ఛైర్మన్ అభిజాత్ చంద్రకాంత్ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఆయన మాట్లాడుతూ మెడికల్ విభాగంలో PPPతో నష్టం ఉండదన్నారు. రోగులకు ఉచిత/రాయితీతో చికిత్సలు అందుతాయని చెప్పారు. ఇప్పటి వరకు PPP కింద నాన్ ప్రాఫిట్ కంపెనీలకు మాత్రమే అనుమతిచ్చామని, ఇకపై కార్పొరేట్ కంపెనీలకూ లీజుకు ఇచ్చేందుకు కొన్ని సవరణలు చేశామని పేర్కొన్నారు.
News January 8, 2026
KNR: విచ్చలవిడిగా నకిలీ వైద్యం.. ప్రాణాలతో చెలగాటం!

ఉమ్మడి జిల్లాలో RMP, PMPలు నకిలీ వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనవసరంగా సెలైన్లు పెడుతూ, ఓవర్ డోస్ మందులిస్తూ, కమిషన్ కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని మెడికల్ కౌన్సిల్ హెచ్చరిస్తున్నప్పటికీ, ఇటీవల తిమ్మాపూర్(M) పోరండ్లకి చెందిన రవీందర్ రెడ్డి నకిలీ వైద్యం చేస్తూ TMC తనిఖీల్లో పట్టుబడ్డారు.
News January 8, 2026
MNCL: పదో తరగతి విద్యార్థులకు ALERT

పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షల కోసం తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.


