News April 10, 2026

ADB: టోల్‌ ప్లాజాలో నగదు చెల్లింపులు బంద్

image

నేటి నుంచి టోల్‌ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్‌ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఫాస్టాగ్‌ రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 13, 2026

ఆదిలాబాద్‌లో మెగా ఇండస్ట్రియల్ పార్క్

image

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లాలో అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణం ఖరారు కావడంతో సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాలకు అవకాశాలు పెరిగాయి. హైవే అనుసంధానం, చనాక-కోరాట నీటి వనరుల లభ్యత కలిసొచ్చే అంశాలు. బీంపూర్, జైనథ్, బోరజ్ మండలాల్లో సుమారు 2,000 ఎకరాల భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మెగా పార్కుతో జిల్లా పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయి.

News April 13, 2026

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా పతనం

image

ఇంటర్ ఫలితాల్లో ADB జిల్లా 13వ స్థానం నుంచి 33వ స్థానానికి పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధ్యాపకుల కొరత, సిలబస్ పూర్తికాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వనరుల లేమి ఫలితాలపై ప్రభావం చూపాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు పనులకు వెళ్లడం, సరైన రివిజన్ లేకపోవడం వెనుకబాటుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా అధ్యాపకులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News April 13, 2026

ADB: రూ.20వేల సాయం.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

image

జిల్లాలో జాతీయ కుటుంబ లాభ పథకం అమలును మరింత పటిష్టం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP)లో భాగంగా అమలవుతుందన్నారు. ఈ పథకం ద్వారా, పేద కుటుంబానికి చెందిన కుటుంబ యజమాని సహజంగా లేదా ఇతర కారణాల వల్ల మరణించినట్లయితే, ఆ కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని వివరించారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.