News August 20, 2025
ADB: డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా..?

ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలో KU దూరవిద్య(SDLCE) పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపాదికన దరఖాస్తు గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. పీజీ 674, డిగ్రీ 673 స్టడీ సెంటర్ నంబర్ కోడ్ ద్వారా www.sdlceku.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పత్రాలతో పాటు సర్టిఫికెట్లను కళాశాలలో అందజేయాలని సూచించారు.
SHARE IT
Similar News
News August 20, 2025
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో.. RMPనే పెద్ద వైద్యుడు!

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా భక్తులు వస్తున్నా, వారికి వైద్యం అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. కేవలం ఓ ఆర్‌ఎంపీ మాత్రమే సేవలు అందిస్తుండగా, ఉన్న ఒక్క అంబులెన్సులోనూ సౌకర్యాలు లేవు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున తక్షణం శాశ్వత వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
News August 20, 2025
HYDలో 24 Hrs బస్సులు నడపాలా? మీ కామెంట్!

ప్రపంచదేశాల ప్రజలు జీవిస్తున్న మహానగరంలో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తార్నాక, హబ్సిగూడ, ఎల్బీనగర్, కోఠి, పంజాగుట్ట, అమీర్‌పేట్, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి విధులు ముగించే మహిళలకి ఇబ్బంది అవుతుందని తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ దీనిని అదునుగా చేసుకుని డబ్బులు దోచేస్తున్నాయని ఆరోపించారు. నైట్‌షిఫ్ట్ బస్సులు నడపాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News August 20, 2025
రేపు చిరు అభిమానులకు సర్‌ప్రైజ్

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కాగా, ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా157 నుంచి రేపు సాయంత్రం అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం.


