News March 23, 2024
ADB: తండ్రి కోసం ములాఖత్‌కు వెళ్లిన కొడుకుకు జైలుశిక్ష

తండ్రి కోసం జైలులోకి గంజాయి పొట్లాలను విసిరి కుమారుడు జైలుపాలైన ఘటన ADB జిల్లాలో చోటుచేసుకుంది. గంజాయి కేసులో సుభాష్‌నగర్‌కు చెందిన బాబుఖాన్ జైలులో ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. కుమారుడు అర్షద్‌ఖాన్ జైలుకు వెళ్లి ములాఖత్‌లో తండ్రిని కలుసుకొని మాట్లాడాడు. అనంతరం తనతో పాటు తీసుకొచ్చిన బీడీల కట్ట, మూడు గంజాయి పొట్లాలను జైలు గోడపై నుంచి తండ్రి కోసం విసిరేశాడు. అతణ్ని అదుపులో తీసుకొని జైలుకు పంపారు.
Similar News
News September 7, 2025
ADB: అధికార యంత్రాగానికి ప్రశంసలు, కృతజ్ఞతల వెల్లువ

ఆదిలాబాద్‌లో 2 వేలకి పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయగా.. ఆదివారంతో నిమజ్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. జిల్లాలో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం 11 రోజులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూసినందుకు ప్రజలు, సామాజికవేత్తలు వారిపై ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
News September 7, 2025
జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మూసివేత

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఉదయం మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
News September 7, 2025
గ్రామ పంచాయతీ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీ అధికారుల(జీపీఓ) పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కొత్తగా నియామక పత్రాలు పొందిన 83 మంది జీపీఓలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి అధికారి తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.