News October 10, 2025
ADB: తండ్రి మరణ వార్త విని కుమారుడి ఆత్మహత్యాయత్నం

తండ్రి సూసైడ్ చేసుకోవడంతో కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ADB జిల్లాలో జరిగింది. బజార్హత్నూర్ మం. వర్తమన్నూర్‌కు చెందిన విజయ్‌కుమార్ పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి శ్రీరాంకాలనీలోని ఇంట్లో ఉరేసుకున్నాడు. దీంతో చిన్నకుమారుడు బస్సులో వస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని రిమ్స్‌కు తరలించారు. కడుపు నొప్పి భరించలేక ఉరేసుకున్నట్లు కుటుంబీకులు ఫిర్యాదు చేశారని మావల SI తెలిపారు.
Similar News
News October 10, 2025
ఏలూరు: బాత్‌రూమ్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఏలూరు శనివారపు పేటకు చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర వెంకటేశ్వరరావు (48) శుక్రవారం స్నానాల గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమవరంలో కూతురు బీటెక్ చదువుతుండటంతో 9 నెలలుగా భార్యతో సహా వెంకటేశ్వరరావు అక్కడే ఉంటున్నారు ఇటీవల వ్యక్తిగత పనులపై ఆయన ఏలూరు వచ్చి ఉంటున్నాడు. త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 10, 2025
HYD: సిలిండర్ సమస్యలపై ఫిర్యాదు చేయండి!

ఓ వ్యక్తికి డెలివరీ అయిన సిలిండర్ లీకేజీ జరుగుతుందని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏంటి ఇంత అధ్వానంగా సిలిండర్ పంపిస్తారా.? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు, HYDలో సిలిండర్ సమస్యలు ఏర్పడితే https://www.mopnge-seva.in/ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News October 10, 2025
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఢిల్లీ NCR, మహారాష్ట్రలో ఉద్యోగాలున్నాయి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruit.southindianbank.bank.in/