News January 23, 2025
ADB: తమ్ముడిని అరెస్ట్ చేశామని ఫోన్

ఆదిలాబాద్ 1 టౌన్‌లో సైబర్ క్రైమ్ కేస్ బుధవారం నమోదైంది. సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. తిర్పల్లికి చెందిన అఫ్రోజ్‌ఖాన్‌కు ఈనెల 16న ఓ కాల్ వచ్చింది. మీ తమ్ముడు తబ్రేజ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడని, అతడిని విడిపించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అతడు వెంటనే వారి ఫోన్ నంబర్లకు నగదు బదిలీ చేశాడు. తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 22, 2025
జగిత్యాల: యథావిధిగా ప్రజావాణి

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జగిత్యాల కలెక్టరేట్ లో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
News December 22, 2025
రాష్ట్రపతి మేడారం ఆహ్వానం పలికిన మంత్రులు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మేడారం జాతర ఆహ్వానం అందింది. బొల్లారంలోని ప్రెసిడెంట్ నివాసానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సమ్మక్క తల్లి చీర, కంకణం, కండువా, బంగారం(బెల్లం) ప్రసాదం అందజేశారు. మేడారం చరిత్రను వివరించారు. మంత్రులకు తిరిగి రాష్ట్రపతి నూతన వస్త్రాలను బహూకరించారు.
News December 21, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

✩శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో
✩జలమూరు: మా రెండు గ్రామాలను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
✩ఆమదాలవలస: పుష్కరిణిలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి
✩నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా: ఎమ్మెల్యే అశోక్
✩పలాసలో రక్తదానం చేసిన మాజీ మంత్రి సీదిరి
✩ గొప్పిలిలో వరి కుప్ప దగ్ధం
✩లావేరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
✩ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ప్రపంచ ధ్యాన దినోత్సవం


