News September 20, 2025
ADB: తల్లడిల్లుతున్న అన్నదాతల గుండెలు..!

విత్తనాలు వేసినప్పటి నుంచి పంటచేతికొచ్చే దాక పొలాన్ని అన్నదాతలు కన్న బిడ్డల్లా సాకుతారు. కళ్లముందే ఆశలతో సాగు చేసుకున్న పంటంతా ఆగమైతే రైతన్న గుండె తల్లడిల్లుతుంది. ఉమ్మడి ADBలో రైతు ఆత్మహత్యలు కలవర పెడుతున్నాయి. పంటను పందులు నాశనం చేశాయని కెరెమెరిలో ఒకరు, వర్షాలతో పెట్టుబడి రాదని ADB జిల్లాలో ఇద్దరు వారంలోనే ప్రాణాలు వదిలారు. అన్నం పెట్టే రైతన్నలను ఏ సర్కారు ఆదుకోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Similar News
News September 20, 2025
SCRలో 14 పోస్టులకు నోటిఫికేషన్

సౌత్ సెంట్రల్ రైల్వే(SCR)లో స్కౌట్స్& గైడ్స్ కోటా కింద 14 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఆయా విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18-33 ఏళ్లలోపు ఉండాలి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి OCT 19 వరకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, నాందేడ్, గుంటూరు డివిజన్లలో రెండేసి చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: <
News September 20, 2025
APPLY NOW: డిగ్రీ అర్హతతో 368 పోస్టులు

RRB 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి <
News September 20, 2025
రాయచోటి: మృతుల కుటుంబీకులకు రూ. 6 లక్షలు

రాయచోటి వరద బీభత్సం<<17768172>> నలుగురిని పొట్టనపెట్టుకున్న విషయం<<>> తెలిసిందే. ఈ మేరకు మృతుల కుటుంబాలను మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పరామర్శించి ప్రభుత్వం తరఫున ఒక్కోరికి రూ. 5 లక్షలు, తాను వ్యక్తిగతంగా రూ. లక్ష ఇచ్చారు. నిన్న సాయంత్రం వర్షం వస్తుండగా.. ఒక అరుగుపైన నిల్చొని ఉన్న తల్లీకొడుకు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లి మరో వ్యక్తి చనిపోయాడు. కాసేపటికి మరో చిన్నారి కొట్టుకుపోయింది.