News December 20, 2025

ADB: తాము ఓడిపోయి.. తమ వాళ్లను ఓడగొట్టుకొని

image

పంచాయతీ ఎన్నికల్లో కొందరు తాము ఓడిపోవడమే కాకుండా తమ వాళ్లను సైతం ఓడించుకున్నారు. పదవిపై ఆశ మనిషిని దూరం చేస్తుందనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత చాలామందికి అర్థమయింది. చాలా ఏళ్ల తర్వాత ADBలో అనేక గ్రామాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో అప్పటివరకు ఒకటిగా ఉన్నా వర్గంలో చీలికలు మొదలయ్యాయి. నేనంటే నేను పోటీ చేస్తానని అందరూ బరిలో దిగారు. చివరకు వారి ఓట్లు చీలి అవతలి వ్యక్తి గెలివడంతో నిరాశలోకి వెళ్లిపోయారు.

Similar News

News December 20, 2025

SVU: ప్రొఫెసర్ కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారు..?

image

తిరుపతి ఎస్వీయూలో ర్యాగింగ్ విచారణ నుంచి బయట పడ్డ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారని ప్రచారం జరుగుతోంది. సైకాలజీ విభాగంలో సిబ్బంది తక్కువ ఉండడంతో తీసుకున్నారంటూ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే నెల రోజులు గడవక ముందే.. కేసు విచారణలో ఉండగా ఆయనను తీసుకోవడం పై విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధం అవుతున్నారు.

News December 20, 2025

సంగారెడ్డి: నూతన సర్పంచ్‌లు.. ముందు ఎన్నో సవాళ్లు!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 22న నూతన సర్పంచ్‌లు పాలక పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెండేళ్లుగా గ్రామాల్లో సర్పంచ్‌లు లేక ప్రధాన సమస్యలు తిష్ట వేశాయి. గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, వీధి దీపాలు, సమావేశాలు, మురికి కాలువలు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాలను ప్రగతిపథంలో నడిపే ఎన్నో సవాళ్లు వారి ముందుకు రానున్నాయి.

News December 20, 2025

ఈ నెల 22 నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ

image

AP: సివిల్, APSP విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 21వ తేదీ తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఇటీవల వీరికి CM నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.