News April 10, 2025

ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

image

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.

Similar News

News September 17, 2025

రజాకార్లకు వణుకు పుట్టించిన ఐలమ్మ..!

image

భూమికోసం విస్నూరు దేశ్ ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డితో వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రపంచ స్థాయిలో ఇప్పటికీ గుర్తుండిపోయింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిని విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఆ రోజుల్లో రజాకార్లకు వెన్నులో వణుకు పుట్టించింది. జనగామ జిల్లా పాలకుర్తిలో 1945లో ఆంధ్ర మహాసభ ఏర్పాటై, రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.

News September 17, 2025

మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించింది ఇక్కడే..!

image

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మహిళలు నగ్నంగా ఆడి పాడాలని రజాకార్ల పాలనలో విస్నూరు దొర ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో అలాంటి ఆకృత్యాలకు సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ విస్నూరు గడి కనిపిస్తోంది. విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు కేంద్రబిందువే ఈ గడి. మాట వినని వారిని రజాకారులతో ఈ గడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టేవారు.

News September 17, 2025

నల్గొండ: రాచకొండల్లో ‘పెళ్లిగుట్ట’.. స్టోరీ ఇదే

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ గుట్టలు కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు కేంద్రంగా ఉండేవి. రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించే వెంకటనర్సింహారెడ్డి, కృష్ణమూర్తి నాయకత్వంలోని గెరిల్లా దళాలు రక్షణ కోసం రాచకొండకు చేరాయి. గెరిల్లా దళ నేత కృష్ణమూర్తి వివాహం రాచకొండలోనే జరిగింది. ఆనాడు వివాహం నిర్వహించిన గుట్టను ఇప్పటికీ ‘పెళ్లి గుట్ట’గా పిలుస్తుంటారు.