News April 10, 2025
ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ అంటూ మాట్లాడారు.
Similar News
News February 24, 2026
భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
News February 24, 2026
NRPT: SSC, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట కలెక్టరెట్‌లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
News February 24, 2026
అష్టావక్రుడి గురించి మీకు తెలుసా?

అష్టావక్రుడంటే 8 వంకరలు ఉన్నవాడు. ఉద్దాలకుని శిష్యుడైన కహోలుని కుమారుడు ఆయన. తండ్రి వేద పఠనంలోని దోషాలను గర్భం నుంచే సరిదిద్దారు. అందువల్ల శాపగ్రస్థుడై 8 వంకరలతో జన్మించాడు. 12 ఏళ్లకే వేద పండితుడై తన తండ్రిని గతంలో ఓడించిన పండితులను వాదనలో ఓడించాడు. ‘జ్ఞానమే వృద్ధాప్యానికి కొలమానం. కానీ వయస్సు కాదు’ అని నిరూపించాడు. రూపం, వయస్సు, వంశాన్ని బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని చాటిచెప్పారు.


