News March 28, 2025
ADB: తెలుగు నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో శుక్రవారం కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్, పడకంటి సూర్యకాంత్, బండారి వామన్, కందుల రవీందర్ తదితరులు ఉన్నారు
Similar News
News November 4, 2025
చేవెళ్ల బస్సు ప్రమాదంపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు దిగ్బ్రాంతి

చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఆత్రం సుగుణక్క ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటనా స్థలంలోని దృశ్యాలు ఎంతో బాధ కలిగించాయని, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
News November 4, 2025
ఆదిలాబాద్: ‘పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్’

పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్ తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యం రిజిస్ట్రేషన్‌పై ఒక రోజు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, పరిశ్రమల శాఖ జీఎం.పద్మభూషణ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
News November 4, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.


