News October 7, 2025
ADB: దామిని యాప్ వాడుదాం

భారీ వర్షాలే కాదు.. పిడుగు పాట్లు ఉమ్మడి ADBకు తీరని లోటును మిగిల్చాయి. ఇటీవల పిడుగుపాటుతో ADBలో ఇద్దరు మృతి చెందగా.. మామడలో ఆలయంపై పిడుగు పడి కొంత మేర ధ్వంసమైంది. ASFలో పశువులు మరణించాయి. వానాకాలం ప్రారంభం నుంచి ఉమ్మడి ADBలో 15+ మంది మరణించారు. పిడుగులను గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం దామీని యాప్ తీసుకొచ్చింది. ఇది పిడుగులను గుర్తించి మనల్ని అలర్ట్ చేస్తుంది.
SHARE IT
Similar News
News April 9, 2026
పరవాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనకాపల్లికి చెందిన పి.రమేశ్ (45) బుధవారం రాత్రి తన అత్త దేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గాజువాక నుంచి అనకాపల్లి వస్తుండగా లంకెలపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా దేవి గాయపడింది. సీఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 9, 2026
అనకాపల్లి: ఈదురు గాలులు, వర్షానికి దెబ్బతిన్న పంటలు

జిల్లాలో పలు మండలాల్లో ఈదురు గాలులు, వర్షానికి నువ్వు, చోడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగిందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి బుధవారం తెలిపారు. వర్షం కారణంగా సుమారు 1,000 ఎకరాల్లో పూత మీద ఉన్న నువ్వు పంటకు తీవ్ర నష్టం వాటిలినట్లు చెప్పారు. ఆలస్యంగా కాపుకు వచ్చిన మామిడి తోటల్లో పిందెలు రాలిపోయినట్లు వెల్లడించారు.
News April 9, 2026
టాయిలెట్ నిర్మాణానికి రూ.12వేలు.. ఇలా అప్లై చేసుకోండి!

TG: ‘స్వచ్ఛ భారత్ మిషన్-2’లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19L ఇళ్లకు వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం ₹12వేల చొప్పున అందించనుంది. 7వేల సామూహిక మరుగుదొడ్లనూ నిర్మించనుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటే మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్వచ్ఛ భారత్ నిధులను ఈ స్కీమ్‌కు లింక్ చేసింది. అర్హులు స్వచ్ఛ్ భారత్ సైట్‌లో <


