News August 26, 2025
ADB: దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హ్యాండీక్యాప్డ్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి కలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
Similar News
News February 22, 2026
రేపు ఆదిలాబాద్‌కు కేటీఆర్.. బాల్క సుమన్‌తో భేటీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. జైలు వద్ద కేటీఆర్ పార్టీ శ్రేణులతో మాట్లాడే అవకాశం ఉంది.
News February 22, 2026
ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News February 22, 2026
ఆదిలాబాద్ : రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచార సహాయక కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను నమోదు చేసి, సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.


