News April 11, 2025
ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్‌కు చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News April 18, 2025
ధరణి బంగాళాఖాతంలో కలుపుతాం అంటేనే అధికారంలోకి: పొంగులేటి

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భోరజ్ మండలం పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణి తొలగించి భూ భారతి తెచ్చామని పేర్కొన్నారు.
News April 18, 2025
కొంకన్న గుట్టపై ఆదిమానవుడి ఆనవాళ్లు

బోథ్ మండలం దన్నూర్(బి) సమీపంలోని కొంకన్నగుట్ట అటవీ ప్రాంతంలో ఆది మానవుడు నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఆర్ఓ ప్రణయ్ తెలిపారు. తన బృందంతో కలిసి శుక్రవారం అడవిని పరిశీలించే క్రమంలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయన్నారు. లక్షల ఏళ్ల కిందట ఆదిమానవుడు ఉపయోగించిన సూక్ష్మ రాతి మొనదేలిన అత్యంత చురుకైన చాకు లాంటి రాళ్లు లభించాయన్నారు. వీటిని వేటకు ఉపయోగించినట్లు తెలుస్తోందన్నారు.
News April 18, 2025
రవితేజ మేనల్లుడి సినిమాలో నటించిన ఆదిలాబాద్ యువకుడు

హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ హీరోగా జగమెరిగిన సత్యం పేరుతో చిత్రీకరించిన MOVIE నేడు విడుదలైంది. మూవీలో అవినాష్ వర్మకు జోడీగా ఆద్య రెడ్డి, నీలిమ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీతో తిరుపతి పాలే డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోన్నారు. కాగా ఈ సినిమాలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిహల్ రాజ్ పుత్ నటించాడు. ఖైదీ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.