News March 17, 2025
ADB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన గిరిజన నిరుద్యోగులు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. దరఖాస్తులను ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News November 8, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓అన్నపురెడ్డిపల్లి: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
✓దమ్మపేట: కలప పట్టివేత
✓ఫర్నిచర్ శిక్షణకు 11 మంది ఎంపిక: కలెక్టర్
✓ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రి సేవలు భేష్.. CRM బృందం నివేదిక
✓మణుగూరు పార్టీ ఆఫీస్ కాంగ్రెస్‌దే: INTUC
✓రైతాంగ సమస్యలపై ఈనెల 12న గ్రామీణ బంద్: CPI(ML)
✓కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
✓మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయి: ఆళ్లపల్లి ఎస్సై
News November 8, 2025
ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 8, 2025
మిర్యాలగూడ: మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పాస్మో ప్రోగ్సి వొన్ ప్లస్ మాత్రలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.


