News March 25, 2025
ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
ADB: తల్వార్‌తో INSTAలో పోస్ట్.. వ్యక్తిపై కేసు

తల్వార్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బంగారిగూడకు చెందకన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం వైరలైందన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు ముఖ్యమైన కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు.
News March 26, 2025
ADB: KU సెమిస్టర్స్ ఫీజు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
News March 26, 2025
ఆదిలాబాద్: CCI సాధన కమిటీ కార్యాచరణ ఇదే.!

ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సమావేశాన్ని మంగళవారం సుందరయ్య భవనంలో నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్చి 28న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 1న ఛలో ఢిల్లీ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నామని, ఉద్యమ ఫొటో, ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. రోజూ సాయంత్రం 4 గంటలకు సీసీఐ సాధన పోరాట కమిటీ సమావేశం నిర్వహించాలని తీర్మానించామన్నారు.