News October 2, 2024

ADB: నేటి నుంచి పాఠశాలలకు 13 రోజులు సెలవులు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఈ సెలవులు అక్టోబర్ 14 వరకు వుంటాయని, తిరిగి పాఠశాలలు ఈ నెల 15న తిరిగి ప్రారంభమవుతాయన్నారు. ఈ సెలవు రోజుల్లో ఎవరైనా ప్రైవేట్ క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చురించారు.

Similar News

News February 22, 2026

ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

image

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

News February 22, 2026

ఆదిలాబాద్ : రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

image

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచార సహాయక కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను నమోదు చేసి, సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.