News December 22, 2025
ADB: నేడు సర్పంచ్‌ల బాధ్యతల స్వీకరణ!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పంచాయతీలు నేడు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మూడు విడతల ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న కొత్త పాలకవర్గాలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. పంచాయతీ కార్యాలయాలను తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ క్రతువు సాగనుంది. పల్లెల అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News December 24, 2025
ఏలినాటి శని దోషాన్ని పోగొట్టే ‘నలుపు’ రంగు

శని దేవునికి నలుపు ప్రీతికరమైనది. ఏలినాటి శని ప్రభావంతో బాధ పడేవారు నల్లని వస్త్రాలు ధరించాలి. నల్ల నువ్వులు దానం చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది. శనీశ్వరుడిని నల్ల నువ్వుల నూనెతో అభిషేకించాలి. నల్లని ఆవులు, కాకులకు నల్ల నువ్వుల ఆహారం పెట్టాలి. నలుపు రంగు శని గ్రహ శక్తిని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుందని నమ్మకం. ఈ పరిహారాలు పాటిస్తే వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఆర్థిక పరమైన ఆటంకాలు తొలగిపోతాయి.
News December 24, 2025
రాష్ట్రంలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు

AP: రాష్ట్రంలో కొత్తగా 4 చోట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు ఆయా కార్పొరేషన్లు డిస్కంలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాయి. తన సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులను PPP విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ఈ ప్లాంట్లు ఉన్నాయి.
News December 24, 2025
నూతన పెన్షన్లపై అనంతపురం కలెక్టర్ కీలక ప్రకటన

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.


