News August 5, 2025

ADB: నేషనల్స్‌కు స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్

image

ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఎస్.చరణ్‌తేజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 3, 4 తేదీల్లో హనుమకొండ వేదికగా జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ట్రయాథ్లాన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరగనున్న పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ రమేశ్ తెలిపారు.

Similar News

News August 6, 2025

తాంసి: ఒకరికి షోకాజ్ నోటీసులు

image

తాంసి PHCని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రిజిష్టర్ పరిశీలించి గైర్హాజరైన వారి వివరాలు డాక్టర్‌ను ఫోన్‌లో ద్వారా తెలుసుకున్నారు. తను అర్బన్ హెల్త్ సెంటర్ హమాలివాడలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నట్లు వైద్యులు శ్రావ్య వాణీ తెలిపారు. తాంసీ పీహెచ్‌సీలో విధులకు గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్ తేజకు షోకాస్ నోటీస్ జారీ చేశారు.

News August 5, 2025

ఆదిలాబాద్: మెగా జాబ్ మేళా.. 296 మందికి నియామకం

image

ఆదిలాబాద్ ఎస్‌టీయూ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ జాబ్ మేళాకు మొత్తం 3,580 మంది అభ్యర్థులు హాజరుకాగా 396 మంది షార్ట్‌లిస్టు అయ్యారన్నారు. వీరిలో 296 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కంపెనీలు అభ్యర్థుల వెరిఫికేషన్ అనంతరం అర్హులను ఎంపిక చేశాయని ఆయన వివరించారు.

News August 5, 2025

ఆదిలాబాద్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఆదిలాబాద్‌లో మౌనిక అనే యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన ఆమె ఆదిలాబాద్‌లోని ఫుట్‌వేర్ దుకాణంలో ఉద్యోగం చేస్తూ భుక్తాపూర్‌లో అద్దె గదిలో నివాసం ఉంటోంది. కాగా మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం గదికి వచ్చి ఉరేసుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించడంతో విషయం బయటకు తెలిసింది. మృతదేహాన్ని రిమ్స్ తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది