News November 4, 2025
ADB: పత్తి రైతుకు మరో కష్టం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
Similar News
News November 4, 2025
వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి ఎలా చేయాలి?

☛వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి.
☛ మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. 
News November 4, 2025
సీఎంఆర్ డెలివరీలో పెద్దపల్లి రికార్డు

2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ రైస్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీని NOV 8 నాటికి పూర్తిచేయాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 99.5% డెలివరీతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. మిగిలిన రైస్‌ను గడువులోగా పంపిణీ చేయాలని, రబీ సీజన్‌కు కూడా సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
News November 4, 2025
ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండండి: VZM JC

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని JC సేథుమాధవన్ పేర్కొన్నారు. అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కామన్ వెరైటీకి క్వింటాకు రూ.2369, గ్రేడ్-ఏ రూ.2389 మద్దతు ధరగా నిర్ణయించారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, 50 లక్షల గోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


