News March 5, 2025

ADB: పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు

image

ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉంటారని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలోనికి సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు.

Similar News

News March 5, 2025

ADB జిల్లాలో కరెంట్ షాక్‌తో రైతు దుర్మరణం

image

కరెంట్ షాక్‌తో ఓ రైతు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పార్డి (కే) గ్రామానికి చెందిన ఉగ్గే హన్మంతు (50) తన చేనులో జొన్న పంటకు నీటిని పెట్టేందుకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో చేను వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతిని ఇంట్లో విషాదం నెలకొంది.

News March 5, 2025

పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు: ADB రాజర్షి షా

image

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 31 పరీక్షా కేంద్రాల్లో 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

News March 4, 2025

ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

error: Content is protected !!