News December 10, 2025

ADB: పల్లెల్లో ఎన్నికలు.. పట్టణాల్లో దావతులు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఉండదని తెలిసి.. ఓటర్లను అక్కడికి తీసుకెళ్లి తమకే ఓటేయాలంటూ ఎర వేస్తున్నట్లు సమచారం. ఇప్పటికే ఎన్నికల నిబంధన కారణంగా వైన్స్ మూసివేయడంతో ఓటర్లను పట్టణాలకు తీసుకెళ్తున్నట్లు గ్రామాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ వారికి దావత్‌లు ఇచ్చి రేపు ఉదయానికి గ్రామాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించే పనిలో ఉన్నారు.

Similar News

News December 24, 2025

జాతీయ సైన్స్ ఫెయిర్‌కు విజయనగరం విద్యార్థుల ఎంపిక

image

చీపురుపల్లి బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు జాతీయ స్థాయితో పాటు దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యాయి. విద్యార్థుల విభాగంలో “క్రాప్ డాక్టర్” ప్రాజెక్ట్ ఎంపికైంది. సుస్థిర వ్యవసాయ లక్ష్యంతో ఏఐ ఆధారిత మొబైల్ యాప్ ద్వారా రైతులకు పంట సమస్యలపై మార్గదర్శకత్వం అందించనున్నారు. పొట్టా స్వప్న రూపొందించిన “గ్రీన్ ల్యాబ్” ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి చేరింది.

News December 24, 2025

ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు: ఈ ఏడాది 41,745 కాల్స్‌కు స్పందన..!

image

కామారెడ్డి జిల్లాలో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో పోలీసులు ‘డైల్-100’ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 41,745 కాల్స్ రాగా, స్పందించి బాధితులకు అండగా నిలిచారు. వీటిలో తీవ్రతను బట్టి 253 కేసులు నమోదు చేయగా, మిగిలిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించారు. ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ‘డైల్-100’కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని SP రాజేష్ చంద్ర సూచించారు.

News December 24, 2025

బిక్కనూర్: Way2News ఎఫెక్ట్.. రైతులకు యూరియా పంపిణీ

image

బిక్కనూర్ మండలం కాచాపూర్‌లో రైతుల ఇబ్బందులపై <<18656388>>‘మళ్లీ రైతులకు తప్పని కష్టాలు’<<>> శీర్షికన Way2Newsలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలో రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేశామని కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. రబీ సీజన్ నేపథ్యంలో గ్రామానికి యూరియా పంపించగా రైతులు వచ్చారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేశామన్నారు.