News December 5, 2025

ADB: పల్లె నుంచి పార్లమెంటు వరకు..!

image

ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సర్పంచ్ కీలక పదవి. అలా గ్రామంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారు కొందరు మంత్రులయ్యారు. ఆ కోవకు చెందినవారే పొద్దుటూరి నర్సారెడ్డి. సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం మూడుసార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందులో ఓసారి ఏకగ్రీవ ఎమ్మెల్యేగా కావడం విశేషం. నర్సారెడ్డిని స్థానికులు నరసన్న బాపు అని ప్రేమగా పిలిచేవారు.

Similar News

News December 6, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన బుచ్చి ఛైర్ పర్సన్

image

బుచ్చి మున్సిపాలిటీ మలిదేవి బ్రిడ్జి వద్ద గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో <<18484228>>’500 మీటర్లలో.. లెక్కలేనన్ని గుంతలు’ <<>>అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులను శనివారం చేపట్టారు. వాహనదారులు ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News December 6, 2025

ఫిట్‌నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

image

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్‌కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్‌నెస్‌ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.

News December 6, 2025

సిరిసిల్ల: స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరపాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్‌తో కలిసి హాజరై మాట్లాడారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.